- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్నానానికి వెళితే.. వంశధార లాగేసింది!
దిశ, వెబ్‌డెస్క్ : స్నానం కోసం వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు వంశధార ప్రధాన కాలువలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో శుక్రవారం వెలుగులోకివచ్చింది. ఎస్‌ఐ శీలవలస లక్ష్మణరావు కథనం ప్రకారం.. మాసాహెబ్‌పేట పంచాయతీ బోరుమజ్జిపాలెం గ్రామానికి చెందిన హనుమంతు లక్ష్మినారాయణ, వరలక్ష్మి దంపతులు హైదరాబాద్‌లో వలస కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కూతురికి పెళ్లికాగా, కొడుకు హనుమంతు శేఖర్ (19) కస్తూరిపాడులో తన అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే క్షవరం చేయించుకుని స్నానం చేసేందుకు వంశధార ప్రధాన కాలువ వద్దకు వెళ్లాడు.
వంతెన మీదుగా నెమ్మదిగా వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడిపోయాడు. ఆ సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కొంతదూరం కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని బయటకు తీసినా ఫలితం లేకుండా పోయింది. ఈ మధ్యే తమ కూతురుకు పెళ్లి చేసిన బాధిత తల్లిదండ్రులు.. కుమారుడి ఉన్నత చదువుల కోసం వలస కూలీలుగా మారారు. ఈ ఘటనతో వారి ఆశలు కాస్త ఆవిరయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మణరావు వెల్లడించారు.