- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గణేశ్ నిమజ్జనంలో అపశృతి..
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ :
గణేశ్ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. గణపతి నవరాత్రుల ముగియడంతో ఇంటి వద్ద ప్రతిష్టించిన విగ్రహాన్ని నిమజ్జనం కోసం గ్రామస్తులు కొండమడుగులోని చెరువు వద్దకు తీసుకుచ్చారు.
ఈ క్రమంలోనే నిమజ్జనం చేస్తుండగా ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. అతన్ని రక్షించేందుకు తోటివారు ప్రయత్నించినా ఫలితం లేకండా పోయింది. ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగిపోయి ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. విషయం తెలియడంతో కొండమడుగు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.
Next Story