మీరు తలపాగా ధరించాలి: కలెక్టర్

by Shyam |
మీరు తలపాగా ధరించాలి: కలెక్టర్
X

దిశ, నల్లగొండ : సూర్యాపేట జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో గత రెండు రోజులుగా వడగాలి ఎక్కువగా వీస్తుందని, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రజలు బయటికి వెళ్లినప్పుడు తెలుపు రంగు, లేత వర్ణములు కలిగిన పలుచటి కాటన్ దుస్తువులు ధరించాలని, ముఖ్యంగా తలకు వేడి తగలకుండా టోపీ, తలపాగా ధరించాలని సూచించారు. ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగిలినవారు పలుచటి మజ్జిగ, గ్లూకోజ్ నీళ్లు, చిటికెడు ఉప్పు, చెంచాడు చెక్కరను ఒక గ్లాసు నీటిలో కలుపుకొని ఇంటిలోనే తయారు చేసుకున్న ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలని పేర్కొన్నారు. జాతీయ వాతావరణ శాఖ ఈ నెల 24 వరకు ఎండతో పాటు వేడి గాలులు బాగా ఉంటాయని తెలిపినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా జిల్లాలోని అన్ని ప్రాథమిక అరోగ్య కేంద్రాల్లో వైద్యులు అప్రమత్తంగా ఉండి వడదెబ్బ నివారణకు మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed