యుగాంతం కోసం జనాల ఎదురుచూపు!

by Shamantha N |
యుగాంతం కోసం జనాల ఎదురుచూపు!
X

2012లో యుగాంతం వస్తుందని అప్పట్లో పుకార్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఇక 2020 మొదలైన నాటి నుంచి ఒకదాని తర్వాత ఒకటిగా విపత్తులు వస్తుండటంతో అప్పుడు జరగాల్సింది ఇప్పుడు జరుగుతోందని కూడా అన్నారు. అంతేకాదు.. ఆ లెక్కలు, ఈ లెక్కలు చూపి మయాన్ కేలండర్ ప్రకారం 2012 అంటే 2020కి సమానం అని కూడా పుకార్లు లేపారు. అయితే ఈ జూన్ 21న అరుదైన గ్రహణం ఉండటంతో ఇదే ప్రళయం వస్తున్న రోజు అని కూడా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ చేశారు. ఇక ఆ రోజున కొంటె నెటిజన్లు ఎదురుచూపులు మొదలెట్టారు. ‘ఎలాగూ యుగాంతం అవుతుందని మా ప్రిన్సిపాల్‌ని తిట్టేశాను అని, యుగాంతం వస్తుందా.. నాకు నిద్రొస్తుంది త్వరగా రమ్మనండి’ అంటూ కామెంట్లు పెట్టారు.

ఇక యుగాంతం గురించి ఎదురుచూస్తున్న మీమ్స్ అయితే కోకొల్లలు. ఇంకెప్పుడు యుగాంతం అంటూ వాట్సాప్ అంకుల్స్.. ఫార్వర్డ్ చేసిన మెసేజ్‌లు షేర్ చేశారు. ఎంత ఎదురుచూసినా ప్రళయాలు రావడం లేదని, హాలీవుడ్ సినిమాల్లో జరిగినట్లు జరిగితే ఫొటోలు దిగి స్టేటస్‌లు పెట్టాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పోస్టులు పెట్టారు. 2012 సినిమాకు ఇప్పటి పరిస్థితికి పోలికలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రళయం రావట్లేదని కొంటె నెటిజన్లు కొందరు కామెంట్లు పెడుతుండగా.. జరగాల్సింది జరిగే వరకు ఈ నెటిజన్లకు నిద్రపట్టేలా లేదని విమర్శకులు అంటున్నారు. ఏదేమైనా యుగాంతం లేదు, ఏమీ లేదని.. పరిశోధకులు, నిపుణులు చెప్పేది వింటూ ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు. ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిన కరోనాకు కూడా మందు దొరికింది కాబట్టి యుగాంతం పెట్టుకోకుండా జీవితంలో ముందుకు సాగడం మీద దృష్టి పెట్టాలని వారు సలహా ఇస్తున్నారు.

Advertisement

Next Story