కరోనా చికిత్స ఉచితంగా అందించాలి

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: పెన్షనర్లకు కరోనా చికిత్సను ఉచితంగా అందించాలని తెలంగాణ పెన్షనర్ల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మయ్య, ఫైనాన్స్ సెక్రటరీ జ్ఞానేశ్వర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుందని, దీర్ఘకాలిక వ్యాధులు ఉండే వయస్సు మళ్లిన వారికి త్వరగా సోకే ప్రమాదం ఉందన్నారు. పెన్షనర్లకు నిజాం ఆస్పత్రిలో ఉచిత చికిత్స అందించాలని కోరుతూ ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు మెయిల్ ద్వారా వినపతిపత్రం సమర్పించారు.

Advertisement
Next Story