తాగిన తర్వాత.. పూరీ రొమాంటిక్ సాంగ్

by Shyam |
Romantic
X

దిశ, సినిమా: టాలీవుడ్ టాప్ హీరోలకు బ్లాక్ బస్టర్లు అందించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తన కొడుకు ఆకాశ్ పూరీని హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు గతంలో ఆకాశ్ హీరోగా ‘మెహబూబా’ సినిమాను తెరకెక్కించినప్పటికీ ఫలితం నిరాశ కలిగించింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆకాశ్.. హోమ్ బ్యానర్ పూరి కనెక్ట్స్‌పై పూరీ, చార్మి కలిసి నిర్మించిన ‘రొమాంటిక్’ మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే మాటలు పూరినే అందించగా.. అనిల్ పాడూరి దర్శకత్వం వహించాడు. కాగా, సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించిన చిత్రం నుంచి ‘పీనే కే బాద్’ అనే లిరికల్ సాంగ్‌ను ఈ నెల 12న ఉ.10.30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Advertisement

Next Story