కరీంనగర్ శివరంజనిపై పీడీయాక్ట్

by Shyam |
కరీంనగర్ శివరంజనిపై పీడీయాక్ట్
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: ఉద్యోగాల పేరిట మోసం చేసిన మహిళను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్‌కు చెందిన శివరంజని అలియాస్ స్వాతిరెడ్డి జీవనోపాథి కోసం హైదరాబాద్‌కు వచ్చింది. ఆమె తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో అందుకు సంబంధించిన అంశాలన్నింటిపై అవగాహన ఉంది. దీంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి నుంచి డబ్బు వసూలు చేసింది. తెలిసిన వారిని ఉన్నతాధికారులుగా పేర్కొంటూ.. హోటళ్లలో ఇంటర్వ్యూలో చేసి నకిలీ జాబ్ ఆఫర్ లెటర్లతో రూ.లక్షల్లో డబ్బు వసూలు చేసింది. 2017నుంచి ఎల్‌బీనగర్, మల్కాజిగిరి, నేరెడ్మెట్ చైతన్యపురి, చిలకలగూడ, ఎస్సార్‌నగర్, తుకారామ్ గేట్ పోలీస్ స్టేషన్లతో పాటు ఏపీలో కూడా పలు మోసాలకు పాల్పడింది. ఈ సమయాలలో ఆమెను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయినప్పటికీ, బెయిల్‌పై విడుదల కాగానే మళ్లీ పాత పద్ధతినే అవలంభిస్తోంది. ఈ ఏడాది మార్చిలో చంచల్‌గూడకు జైలుకు తరలిస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకుంది. ఇలా పదే పదే మోసాలకు పాల్పడుతుండటంతో పీడీయాక్ట్ నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed