పీఎస్ఎల్ నిర్వహించినా మాకు నష్టమే : పీసీబీ

by Shyam |
PSL
X

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా వాయిదా పడిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 6వ సీజన్ జూన్ 9 నుంచి అబుదాబి వేదికగా ప్రారంభం కానున్నది. కరాచీలో ఏర్పాటు చేసిన బయోబబుల్‌లో కరోనా కేసులు బయటపడటంతో అర్థాంతరంగా లీగ్ వాయిదా వేశారు. కాగా, పీఎస్ఎల్ 6లో మిగిలిన 20 మ్యాచ్‌లు అన్నీ అబుదాబి వేదికగా జరుగనున్నాయి. వాస్తవానికి జూన్ 1 నుంచే లీగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. బ్రాడ్‌కాస్ట్ సిబ్బందికి అబుదాబీలోకి ప్రవేశించడానికి అనుమతి లేకపోవడంతో ఆలస్యం జరిగింది.

కాగా, పీఎస్ఎల్ 6 అబుదాబిలో విజయవంతంగా పూర్తి చేసినా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ఆర్థికంగా నష్టమే అని సీఈవో వాసిమ్ ఖాన్ తెలిపారు. ‘అబుదాబీకి తరలించడం వల్ల పీసీబీకే కాకుండా ఫ్రాంచైజీలకు కూడా ఖర్చులు పెరిగాయి. బ్రాడ్‌కాస్టర్ కూడా తమకు నష్టాలు వస్తాయని చెబుతున్నారు. లీగ్‌ను మార్చడానికి త్వరగా నిర్ణయం తీసుకోవడం వల్ల అదనంగా ఎంత ఖర్చు అవుతుందో తెలియడం లేదు. మేం మాత్రం భారీగానే ఆదాయాన్ని కోల్పోనున్నాము. దీంతో మాకు నష్టాలే వస్తాయి. అయితే లీగ్ పేరు దెబ్బతినకూడదనే ఈ సీజన్ యూఏఈలో పూర్తి చేయాలని నిర్ణయించాము’ అని వాసిమ్ ఖాన్ చెప్పారు.

Advertisement

Next Story