మాజీ క్రికెటర్ల యూట్యూబ్ ఛానల్స్‌పై పీసీబీ ఆంక్షలు

by Shyam |
మాజీ క్రికెటర్ల యూట్యూబ్ ఛానల్స్‌పై పీసీబీ ఆంక్షలు
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ (Pakistan) దేశవాళీ క్రికెట్‌తో సంబంధం ఉన్న మాజీ క్రికెటర్లు యూట్యూబ్ ఛానల్స్ (YouTube channels) నడపకూడదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్ కాంట్రాక్టు కోచ్‌లుగా పని చేస్తున్న మాజీ క్రికెటర్లు(Former cricketers) యూట్యూబ్ ఛానల్స్ పెట్టి.. అందులో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారని, ఇకపై ఇలా చేయకుండా పీసీబీ నిషేధం విధించింది. ఇప్పటికే కొత్త కోచ్‌లకు సమాచారం ఇవ్వగా, పాత కోచ్‌లకు నోటీసులు(Notices) పంపినట్లు తెలుస్తున్నది. ఇకపై తమ ఛానల్స్‌లో ఎలాంటి ఇంటర్వ్యూలు(Interviews) నిర్వహించాలన్నా తప్పనిసరిగా పీసీబీ అనుమతులు తీసుకోవల్సి ఉంటుంది. దేశవాళీ క్రికెట్‌లో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా సమూల ప్రక్షాళనకు పీసీబీ నడుం బిగించింది.

క్రికెట్ బలోపేతం కోసం దేశవాళీ కోచ్‌లుగా ఒక ప్యానల్ ఏర్పాటు చేసింది. మహ్మద్ యూసుఫ్(Mohammad Yusuf) బ్యాటింగ్‌ కోచ్‌(batting coach)గా ఉండటంతోపాటు ప్యానల్‌లో అబ్దుల్‌ రజాక్‌(Abdul Razzaq), ఐజజ్‌ చీమా(Aizaz Cheema), బాసిత్‌ అలీ(Basit Ali), ఫైసల్‌ ఇక్బాల్‌(Faisal Iqbal), గులామ్‌ అలీ(Ghulam Ali), హుమయూన్‌ ఫర్హత్‌ (Humayun Farhat), ఇర్ఫాన్‌ అలీ(Irfan Ali), జాఫర్‌ ఇక్బాల్‌(Zafar Iqbal) వంటి అంతర్జాతీయ క్రికెటర్లు(International cricketers) దేశవాళీలో కోచింగ్‌ ఇవ్వనున్నారు. మాజీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లు అఫ్తాబ్‌ ఖాన్‌, అస్లామ్‌ ఖురేషీ, ఫహద్‌ మసూద్‌, హబీబ్‌ బాలూచ్‌, హఫీజ్‌ మజిద్‌ జహంగీర్‌, హనీఫ్‌ మాలిక్‌, మహ్మద్‌ సాధిక్‌ సైతం కోచింగ్‌ ప్యానెల్‌కు ఎంపికయ్యారు. కోచింగ్‌ ప్యానెల్‌కు ఎంపికైన ఎవ్వరూ యూట్యూబ్‌లో అభిప్రాయాలు వెల్లడించకూడదని పీసీబీ ఆదేశించింది. పాక్ మాజీ క్రికెట్లర్లు ఇంజమామ్(Inzamam), షోయబ్ అక్తర్(Shoaib Akhtar), ఫైసల్ ఇక్బాల్ వంటి వాళ్లు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి బోర్డుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆటగాళ్లపై కూడా వీళ్లు తీవ్రమైన పదజాలంతో విమర్శించడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed