దుర్గమ్మ ఆలయంలోనే అలా చేస్తారా..?: పవన్

by srinivas |
దుర్గమ్మ ఆలయంలోనే అలా చేస్తారా..?: పవన్
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. పదేళ్లుగా అక్కడ పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో కొందరికే పని కల్పించటం దారుణమన్నారు. ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించవద్దని ఆలయ అధికారులకు సూచించారు. కరోనా సమయంలో ఆలయాన్ని మూసేసినప్పుడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ విధులకు దూరంగా ఉంచి.. తిరిగి ఆలయం ప్రారంభించినప్పుడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో కొందరిని మాత్రమే విధులకు పిలిచి, మరి కొందరికి సమాచారమే ఇవ్వలేదని పవన్ ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించి వారి వివరాలను సంబంధిత కార్పొరేషన్‌లో నమోదు చేయించేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story