- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పవన్ ఫ్యాన్స్ బీభత్సం.. కుర్చీలు విరగ్గొట్టి రచ్చ రచ్చ
X
దిశ, వెబ్‌డెస్క్: దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అవ్వడంతో థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ‘జై పవన్ కల్యాణ్’.. ‘వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్’ అంటూ నినాదాలు చేస్తూ హంగామా సృష్టిస్తున్నారు. ఏపీలో పలుచోట్ల పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బెనిఫిట్ షోలను రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ ఫ్యాన్స్.. తిరుపతిలోని శాంతి థియేటర్లపై రాళ్లు రువ్వడం ఉద్రిక్తతకు దారితీసింది.
తాజాగా కడప జిల్లా బద్వేల్‌లో పవన్ ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు. అత్యుత్సాహంతో థియేటర్‌లోని కుర్చీలు విరగ్గొట్టి రచ్చ రచ్చ చేశారు. దీంతో థియేటర్, అభిమానుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో బెనిఫిట్ షో, ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.
Advertisement
Next Story