మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి నిధులు మంజూరు

by Shyam |
మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి నిధులు మంజూరు
X

దిశ, మహబూబ్‌నగర్: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి నిధులు మంజూరు చేస్తున్నట్టు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల వారీగా చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మొత్తం 19 మున్సిపాలిటీలకు రూ. 7.09 కోట్ల నిధులు రానున్నాయి. మున్సిపాలిటీల వారీగా చూస్తే మహబూబ్ నగర్ రూ. 1,91,97,894, జడ్చర్ల రూ. 48,44,184, భూత్పూర్ రూ. 16,43,154, నాగర్ కర్నూల్ రూ. 30,35,952, కొల్లాపూర్ రూ. 23,71,665, కల్వకుర్తి రూ. 31,28,409, అచ్చంపేట రూ. 26,31,187, నారాయణపేట రూ. 36,81,442, కోస్గి రూ. 24,20,806, మక్తల్ రూ. 25,34,092, వనపర్తి రూ. 61,32,125, కొత్తకోట రూ. 17,57,877, పెబ్బేరు రూ. 17,84,602, ఆత్మకూరు రూ. 16,23,113, అమరచింత రూ. 12,73,946, గద్వాల రూ. 58,58,843, ఐజ రూ. 34,95,274, వడ్డేపల్లి రూ. 15,67,381, అలంపూర్‌కు రూ. 21,52,484 నిధులు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెల్లువడ్డాయి.

Tags: funds release, municipalities, pattana pragathi, telangana govt

Advertisement

Next Story