- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మా బాధలు బాల్క సుమన్ తీర్చాలి.. చెన్నూర్‌లో ప్రయాణికుల ఆవేదన
by Aamani |

X
దిశ, చెన్నూర్: చెన్నూరు మండల పరిధి గ్రామాల ప్రయాణికులు.. ఆర్టీసీ అధికారుల సమయపాలనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు గంటలు గంటలు వేచి చూడాల్సి వస్తోంది. గతంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో కూడా ఎటువంటి నియమాలు పాటించకుండా, కెపాసిటీకి మించి నిలుచొని రావాల్సి వస్తోందంటున్నారు. చెన్నూరులో బస్సు డిపో ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు హామీలు కురిపించిన రాజకీయ నాయకులు మాట తప్పారని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ వ్యవహారంపై చొరవ తీసుకొని.. ఆర్టీసీ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు సమస్యలు నిలువరించాలని వేడుకుంటున్నారు.
Next Story