- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘దేవినేని’తో ఆగిపోను.. ‘పరిటాల రవి’ బయోపిక్ కూడా చేస్తున్నా!
by Jakkula Samataha |

X
దిశ, సినిమా: నర్రా శివనాగు డైరెక్షన్‌లో ‘దేవినేని’ చిత్రం ద్వారా దేవినేని నెహ్రూ జీవితకథను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే మార్చి 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. అయినా ఇలాంటి వివాదాస్పద చిత్రాలను తీసేందుకు వెనకాడబోనంటూ మరో సినిమా ప్రకటించారు దర్శకులు. ‘దేవినేని’ తర్వాత పరిటాల పేరుతో మరో సినిమాను తీసుకురాబోతున్నట్టు వెల్లడించారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజకీయ సంచలనం పరిటాల రవి జీవితకథను తెరకెక్కించబోతున్నట్టు స్పష్టం చేశారు. కాగా పరిటాల పాత్రలో తనను పోలిన నటుడు డీఎస్. రావు నటించనున్నారు. ఎన్ షో టైమ్ బ్యానర్‌పై రజనీకాంత్, సీహెచ్ నాగేశ్వర రావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.
Next Story