కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి

by Shamantha N |
కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి
X

దిశ,వెబ్ డెస్క్ : తమిళనాడు ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. రాజకీయంగానే కాకుండా సొంత విషయాలను కూడా వీరు ప్రస్తావించుకుంటున్నారు. ఈ క్రమంలో తమిళనాడు సీఎం పళనిస్వామి తల్లిని కించపరిచేట్లుగా చేసిన వ్యాఖ్యలపై ఆయన కంటతడి పెట్టుకున్నారు. చెన్నై తిరువొత్తియూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పళనిస్వామి ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ కంటతడి పెట్టుకున్నారు. తన తల్లి గ్రామీణ ప్రాంతంలో ఉండేవారని, కన్నుమూసిన ఆమె గురించి కించపరుస్తూ మాట్లాడుతున్న వారికి భగవంతుడు తగిన శిక్ష వేస్తాడని పళనిస్వామి కన్నీటి పర్యాతం అయ్యారు. సాధారణ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే డీఎంకే వారు ఏవేవో మాట్లాడుతూ కించపరుస్తున్నారని సీఎం పళనిస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై డీఎంకే ఎ. రాజాపై కేంద్ర నేర విభాగ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Next Story

Most Viewed