- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందులో పేరులేదని రైతు ఆత్మహత్య.. అధికారుల నిర్లక్ష్యమేనా..?
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఓ నిర్వాసితుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం తెల్లవారుజామున కొల్లాపూర్ మండలంలోని సున్నపు తండాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి తండావాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా 2015 సంవత్సరంలో తండా వాసులతో పాటు బాలు నాయక్(50) అనే రైతుకు సంబంధించి ఆరు ఎకరాల పొలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఎకరాకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి.
కాగా నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా లభించవలసిన బెనిఫిట్ లు బాలు నాయక్ కు రాలేదు. ఇటీవల ప్రకటించిన లబ్ధిదారుల జాబితాలోనూ బాలు నాయక్ పేరు లేకపోవడంతో మరింత తీవ్ర నిరాశా నిస్పృహలకు గురై గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తండా వాసులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.