ఆఫ్ఘన్‌ని చిత్తు చేసిన పాక్..

by Shyam |
T20 cricket match
X

దిశ, వెబ్‌డెస్క్ : టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ దూసుకుపోతోంది. మొదటి మ్యాచ్‌లోనే భారత్‌ను ఓడించిన పాక్.. శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను విజయకేతనం ఎగరవేసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఫైటింగ్ టార్గెట్ సెట్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ మొదట్లో వరుసగా వికెట్లు కోల్పోయింది. వచ్చిన బ్యాటర్ వచ్చినట్టు భారీ షాట్లకు ప్రయత్నించి తగిన మూల్యం చెల్లించుకున్నారు. మహమ్మద్ షెహజాద్, అస్ఘర్ ఆఫ్ఘన్, రహ్మానుల్లాహ్ గుర్బాజ్ ఇలా వరుసగా ఔటవ్వడంతో 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ వెంటనే నజీబుల్లా జాద్రన్ కూడా ఔటవ్వడంతో 76 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మహమ్మద్ నబీ 32 బంతుల్లో 35 పరుగులు, గుల్బాదిన్ నయిబ్ 25 బంతుల్లో 35 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు.
నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.

148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్, ఓపెనర్ రిజ్వాన్ 8 పరుగులతో నిరాశపరచగా కెప్టెన్ బాబర్ అజాం, ఫకర్ జమాన్ నిలదొక్కుకున్నారు. ఈ క్రమంలోనే బాబర్ అజాం తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తరువాత వరుసగా వికెట్లు పోవడంతో గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. ఒక క్రమంలో పాక్ గెలవడం అసాధ్యం అనుకున్న టైం లో అసిఫ్ అలీ ఒకే ఓవర్ లో 4 సిక్స్ లు కొట్టడంతో ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే పాక్ విజయం సాధించింది. దీంతో పాక్ దాదాపు సెమిస్ బెర్తుని ఖరారు చేసుకుంది.

Advertisement

Next Story