- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మలయాళ సినిమాలకు ఫ్యాన్ అయిపోయిన పాకిస్థానీ హీరోయిన్
దిశ, సినిమా : మలయాళ చిత్రం.. కథను నమ్ముకుని తెరకెక్కుతుంది. ప్రాంతీయతను ప్రతిబింబిస్తుంది. ఒరిజినాలిటీకి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటుంది. ఇక స్టార్‌డమ్ మ్యాటర్స్, అనవసర హంగులకు ఎంత దూరమో.. హెవీ మేకప్, ఓవర్ యాక్టింగ్, ఎక్స్‌ట్రా ప్రమోషన్స్‌కు అంతకన్నా దూరం. ఇలా రొటీన్ స్టోరీస్‌కు పూర్తి భిన్నంగా సినిమాలు తెరకెక్కించే మాలీవుడ్ మేకర్స్.. లాక్‌డౌన్‌లోనూ సూపర్బ్ కంటెంట్‌తో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. వావ్ అనిపించే చిత్రాలతో ఎప్పటికప్పుడు అమేజింగ్ అనిపించుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే భారతీయ సినీ ప్రముఖులు చాలా మంది మలయాళ ఇండస్ట్రీని పొగడ్తల్లో ముంచెత్తారు. బాలీవుడ్‌ను తలదన్నే సినిమాలతో మెప్పిస్తున్నారని కీర్తించారు. తాజాగా పాకిస్థానీ హీరోయిన్ మహీరా ఖాన్ సైతం వీరి సినిమాలకు ఫ్యాన్ అయిపోయింది. ఈ విషయాన్ని ఓ వర్చువల్ ఇంటర్వ్యూలో తెలిపిన మహీరా.. మలయాళ సినిమాలను పరిచయం చేసిన భారతీయులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇంటర్వ్యూ చూసే ప్రతీ ఒక్కరు మలయాళ మూవీస్ చూడాలని అభ్యర్థించిన నటి.. తన అభిమానులు కచ్చితంగా చూస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది. మాలీవుడ్ మూవీస్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయాలని తన స్నేహితులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నానని, కనీసం ఒక్క సినిమా అయినా చూసి తీరాలని, ఇంత మంచి చిత్రాలను మిస్ చేసుకోవద్దని కోరింది.