బయోబబుల్ నిబంధనల అతిక్రమణకు పర్యవసానం

by vinod kumar |
బయోబబుల్ నిబంధనల అతిక్రమణకు పర్యవసానం
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా లాక్‌డౌన్ అనంతరం బయో సెక్యూర్ వాతావరణంలో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభమైంది. ప్రత్యేకమైన బయోబబుల్ సృష్టించి.. సిరీస్ అయిపోయే వరకు క్రికెటర్లు, సహాయక సబ్బంది అందులోనే ఉండేలా కఠిన నియమనిబంధనలు విధిస్తున్నారు. ఐపీఎల్‌లో అతి పెద్ద బయోబబుల్‌ను బీసీసీఐ, ఈసీబీ సృష్టించాయి. ప్రస్తుతం టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటన కూడా కఠినమైన నిబంధనల నడుమే జరుగుతున్నది. అయితే ఇటీవల న్యూజీలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ క్రికెటర్లు మాత్రం బయోబబుల్ నిబంధనలు పలుమార్లు ఉల్లంఘించారు. దీంతో ఇప్పటికే మూడు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. తాజాగా వాటి సంఖ్య 7కు పెరిగింది.

బయోసెక్యూర్ నిబంధనలు ఉల్లంఘించిన స్పిన్నర్ రాజా హసన్‌పై పీసీబీ కఠినమైన చర్య తీసుకున్నది. బయోబబుల్ నుంచి బయటకు వెళ్లిన అతడికి కరోనా సోకకున్నా.. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను న్యూజీలాండ్ పర్యటన నుంచి పాక్ క్రికెట్ బోర్డు వెనక్కు రప్పించింది. న్యూజీలాండ్‌లో వైద్య బృందం అనుమతి లేకుండా బయటకు వెళ్లాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత కొంత మంది క్రికెటర్లు బయటకు వెళ్లడం వల్లే కరోనా బారిన పడినట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed