క్లాసీ అండ్ రొమాంటిక్ అవతార్‌లో ‘పాగల్’ విశ్వక్

by Shyam |   ( Updated:2021-02-02 04:26:33.0  )
క్లాసీ అండ్ రొమాంటిక్ అవతార్‌లో ‘పాగల్’ విశ్వక్
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘పాగల్’. ఈ చిత్రం ద్వారా నరేశ్ కుప్పిలి దర్శకుడిగా పరిచయం కాబోతుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశ్వక్ సూపర్ స్టైలిష్, ఫన్ అండ్ కూల్ ట్రెండీ అవతార్‌లో ఉన్న పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్.. రిలీజ్ అప్ డేట్ ఇచ్చేసింది. ప్రేక్షకుల మదిని దోచుకునేందుకు ఏప్రిల్ 30న ‘పాగల్’ థియేటర్స్‌కు వచ్చేస్తున్నట్లు ప్రకటించారు.

రధన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. విశ్వక్ న్యూ లుక్‌కు సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. విశ్వక్‌ను క్లాసీ అండ్ రొమాంటిక్ అవతార్‌లో చూసేందుకు ఎగ్జైట్ అవుతున్నట్లు తెలిపారు. ఇదే రోజున సాయి పల్లవి, రానా దగ్గుబాటి ‘విరాటపర్వం’ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకులు. సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ‘పాగల్’ ‘విరాటపర్వం’ మూవీ జోనర్స్ డిఫరెంట్ కాబట్టి రెండిటికీ ప్రేక్షకుల ఆదరణ లభించే అవకాశం ఉంది.

Advertisement

Next Story