- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఫైనల్‌లో ఓడిన సింధు..
by Shiva |

X
దిశ, స్పోర్ట్స్ : స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు ఫైనల్‌లో ఓడిపోయింది. ఈ సీజన్ తొలి బీడబ్ల్యూఎఫ్ 300 టోర్నమెంట్‌లో రాణించడం ద్వారా ర్యాంకులు మెరుగుపరుచుకోవాలని భావించిన పలువురు భారత షట్లర్లకు నిరాశే ఎదురైంది.
మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన ప్రపంచ చాంపియన్ పీవీ సింధు.. రియో గోల్డ్ మెడలిస్ట్ కరోలినా మారిన్‌పై 12-21, 5-21 తేడాతో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో మొదటి నుంచి మారిన్ దూకుడుగా ఆడింది. మారిన్ వేగానికి పీవీ సింధు వద్ద సరైన జవాబు లేకుండా పోయింది. మ్యాచ్ మొత్తంలో ఏ సమయంలోనూ పీవీ సింధు ధీటుగా ఆడలేదు. కరోలినా మారిన్‌కు 2021లో ఇది మూడో టైటిల్ కావడం గమనార్హం.
ఇక పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నెంబర్ 1 విక్టర్ అక్సెల్‌సెన్ 21-16, 21-6 తేడాతో కున్లవుత్‌పై విజయం సాధించి చాంపియన్‌గా నిలిచాడు.
Next Story