ఒడిశా నుంచి తెలంగాణకు ఆక్సిజన్

by Shyam |
ఒడిశా నుంచి తెలంగాణకు ఆక్సిజన్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేకుండా చూడడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం ఒడిశా నుంచి తెలంగాణకు ఆక్సిజన్ కేటాయించింది. అక్కడి నుంచి ఆక్సిజన్ నిలువలను రాష్ట్రానికి తరలించే పనులను వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఆక్సిజన్ ట్యాంకర్లను ఎయిర్ లిఫ్ట్ ద్వారా తీసుకొస్తున్నారు. ఆక్సిజన్ తెచ్చే వాహనాలు గంటకు 40 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంగా ప్రయాణం చేయకూడదు. మూడు రోజుల సమయం పడుతుంది. దీనిని నివారించేందుకు, అనేక మంది ప్రాణాలను కాపాడుకునేందుకు వాయుమార్గాన్ని ఎంచుకున్నారు. ఆక్సిజన్ రవాణా పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి, సీఎస్‌లను మంత్రి కేటీఆర్ అభినందించారు.

Advertisement

Next Story