బాలికపై హత్యాచారయత్నం

by Anukaran |   ( Updated:2020-10-05 05:56:29.0  )
బాలికపై హత్యాచారయత్నం
X

దిశ‌,ఖమ్మం టౌన్.
ఖమ్మం నగరంలో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. ముస్తాఫానగర్ లోని ఓ సంపన్న కుటుంబం దగ్గర పల్లెగూడెం గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక పనిచేస్తున్నది. కాగా ఆ బాలికపై ఆ ఇంటి యజమాని కుమారుడు అత్యాచారయత్నం చేశాడు. అందుకు బాలిక నిరాకరించడంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాదాపు 70 శాతం కాలిన గాయాలతో ఆమె ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

బాలికను సంపన్న కుటుంబ యజమాని కుమారుడు తీవ్రంగా భయపెట్టినట్లు తెలుస్తోంది. విషయం ఎవరికైనా చెబితే నీతో పాటు నీ తల్లిదండ్రులను కూడా చంపేస్తానని ఆమెను అతను హెచ్చరించినట్లు సమాచారం. కాగా ప్రమాదవ శాత్తు జరిగిన ఘటనగా దీన్ని చిత్రీకరించేందుకు అతను ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలిక కుటుంబానికి రూ. 1.50 లక్షలు ఇస్తామని ప్రలోభానికి అతను గురి చేసినట్టు సమాచారం.

కాగా ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత కుటుంబీకులు ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తనపై జరిగిన దురాగతాన్ని ఆ బాలిక వివరించిన వీడియో కూడా ఘటన పూర్వాపరాలకు ప్రబల నిదర్శనంగా నిలుస్తోంది.

Advertisement

Next Story