- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్థిక నేరగాళ్ల షేర్ల విక్రయం ద్వారా రూ. 792 కోట్ల రికవరీ
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ బ్యాంకులను మోసం చేసిన పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలకు చెందిన రూ. 9.371 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ బ్యాంకుల కన్సార్టియంకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేలం వేసింది. తాజాగా వీటిలో కొన్ని షేర్లను ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్టియం రూ. 792.11 కోట్లను రాబట్టుకుంది. ఇప్పటి వరకు ఈడీ రూ.13,109.17 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులకు అప్పగించింది.
ఈ ముగ్గురు వ్యాపారవేత్తలు బ్యాంకులకు రూ. 22,585.83 కోట్ల వరకు నష్టం ఏర్పడిందని ఈడీ గతంలో వెల్లడించింది. ఇందులో 84.45 శాతం రూ. 18,170.02 కోట్ల విలువైన ఆస్తులని ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది. ఇందులో రూ. 9,371 కోట్ల ఆస్తులను బ్యాంకుల కన్సార్టియంకు బదిలీ చేసింది. ఇందులో ముగ్గురికీ చెందిన షేర్లు ఉండగా, ఇదివరకు రూ. 7,181 కోట్ల షేర్లను కన్సార్టియం తరపున విక్రయించింది. తాజాగా, మరో రూ. 792 కోట్ల షేర్లను విక్రయించి డబ్బును సాధించుకుంది.