KA OTT Release Date : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ ‘క’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by sudharani |   ( Updated:2024-11-23 15:21:58.0  )
KA OTT Release Date : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ ‘క’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన తాజా చిత్రం ‘క’ (KA Movie) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకత్వం వహించగా.. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్ఫణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించారు. ఇక దీపావళి స్పెషల్‌గా అక్టోడర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫుల్ పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవి విన్ సొంతం చేసుకోగా.. న‌వంబ‌ర్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రయూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

Read More...

Mahesh Babu : మేనల్లుడి సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్..!!


Next Story