- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
120 జీవోను రద్దు చేయాలని సీఎంకు విజ్ఞప్తి
దిశ, వెబ్‌డెస్క్ : సలార్ మూవీకి టికెట్ రేట్లపై చిన్న నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మల్టీ ప్లెక్స్‌లో ప్రదర్శించే సినిమాలకు 450 రూపాయలు వసూలు చేయాలని వస్తున్న వార్తలపై వారు మండిపడుతున్నారు. ఈ నిర్ణయంతో చిన్న సినిమాలను ఎవరు చూస్తారని, తమ సినిమాలను చంపివేయడమే జరుగుతుందని వారు తమ వాదనను వినిపిస్తున్నారు. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జారీ చేసిన 120 జీవో వల్లనే అని పేర్కొంటున్నారు. ఈ జీవో వల్ల ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు టికెట్ రేట్లను పెంచుకోవచ్చు. దాంతో దీనిని రద్దు చేయాలని చిన్న నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించుకొంటున్నారు. టికెట్ల రేట్ల పెంపుపై అడ్వకేట్ జీఎల్. నరసింహారావు పిల్ దాఖలు చేశారు. అలాగే చిన్న నిర్మాతల సంఘం తరుఫున నట్టి కుమార్ ఘాటుగా స్పందించారు. సలార్ సినిమా టికెట్ మల్టీప్లెక్స్‌లో 200 రూపాయలు, సింగిల్ స్క్రీన్ 100 రూపాయలకు మించి ఉండకూడదని సీఎంకు విజ్ఞప్తి చేశారు.