ఓటీటీ లోకి వచ్చేసిన అనుష్క హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

by Hamsa |   ( Updated:2023-10-05 06:25:08.0  )
ఓటీటీ లోకి వచ్చేసిన అనుష్క హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’. మహేష్ బాబు తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 7న థియేటర్స్‌లో విడుదలైంది. మొదటి షోతోనే ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని ప్రేక్షకుల మెప్పు పొందినది. అంతేకాకుండా భారీ కలెక్షన్స్‌లో రాబట్టి లాభాల బాట పట్టింది.

తాజాగా, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అర్థరాత్రి 12 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో అనుష్క శెట్టి ఫ్యాన్స్ సినిమాను చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారట. ఈ మూవీ థియేటర్స్‌లో లాగా ఓటీటీ ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందో లేదో చూడాలి మరి.

Read More: చీరకట్టులో కట్టిపడేస్తున్న Eesha Rebba

Advertisement

Next Story

Most Viewed