నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోన్న.. రొమాంటిక్ లవ్ స్టోరీ! స్ట్రీమింగ్ ఎందులోనంటే?

by Jakkula Mamatha |   ( Updated:2025-03-12 14:40:45.0  )
నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోన్న.. రొమాంటిక్ లవ్ స్టోరీ! స్ట్రీమింగ్ ఎందులోనంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రేమికుల రోజు(Valentine's Day) సందర్భంగా విడుదలై యూత్‌ను ఆకట్టుకున్న మూవీ ‘2K లవ్ స్టోరీ’(2K Love Story). సుసీంథీరన్ దర్శకత్వంలో జగ్ వీర్(actor Jagveer) - మీనాక్షి గోవిందరాజన్(Meenakshi Govindarajan), ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా కోసం కుర్రకారంతా చాలా కుతూహలంతో ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి డి.ఇమ్మాన్ సంగీతం అందించారు. ఈ నేపథ్యంలో ‘2K లవ్ స్టోరీ’ థియేటర్లలో విడుదలై నెల రోజులు గడవక ముందే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.

రొమాంటిక్ డ్రామా (romantic drama) ‘2K లవ్ స్టోరీ’ OTTలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం మార్చి 14 నుంచి ఆహా తమిళ్‌లో ప్రసారం కానుందని ఆ ప్లాట్‌ఫామ్ తాజాగా సోషల్ మీడియా(social media)లో ప్రకటించింది. ఈ క్రమంలో ఒకేసారి రెండు OTT ప్లాట్ ఫార్మ్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈనెల 14వ తేదీన ‘ఆహా’ తమిళ్‌తో పాటుగా అమెజాన్ ప్రైమ్ లో 2K లవ్ స్టోరీ మూవీ రిలీజ్ అవ్వనుంది.

ఆహా తమిళ్ ఓటీటీలో తెలుగులోనూ ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో.. ‘‘ఈ కాలం స్నేహాలు ఎలా ఉన్నాయి? వారు స్నేహితులుగా కలిసి ఉండటానికి ఎలా ఎంచుకుంటారు, వారి వ్యక్తిగత జీవితాలు, ప్రేమలు .. ఇతర రిలేషన్స్ ఎలా ఉన్నాయి?’’ అనే అంశాల చుట్టూ తిరిగే కథ ఇది. అయితే రిలీజ్ తరువాత ఈ మూవీ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. థియేటర్ల నుంచి పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయిన.. ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ను రాబట్టుకుంటుందనేది చూడాలి.

Next Story

Most Viewed