- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓయూ డౌన్.. ఐఐటీ అప్
దిశ, న్యూస్‌బ్యూరో: హెచ్‌ఆర్‌డీ విడుదల చేసిన ది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్స్ (ఎన్‌ఐఆర్ఎఫ్) జాబితా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ తన పట్టుకోల్పోయింది. గురువారం ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్‌లో మద్రాస్ ఐఐటీ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని 100 అత్యున్నత యూనివర్సిటీలకు ఈ ర్యాంకింగ్స్ ఫలితాలను ప్రకటించారు. ఈ జాబితాలో ఉస్మానియా యూనివర్సిటీ గతేడాదితో పోలిస్తే తన పట్టు కోల్పోయి పది స్థానాలకు పడిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా నాలుగు స్థానాలు కోల్పోయింది. ఐఐటీ- హైదరాబాద్ కాస్త మెరుగ్గా ఫలితాల్లో ముందుకు రాగా.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వరంగల్) 15 స్థానాలు ముందుకు వచ్చింది. గత నాలుగేండ్లుగా ఎన్ఐటీ తన స్థానాన్ని మెరుగు పరుచుకుంటూ వస్తుండటం గమనార్హం. ఐదు కేటగిరీలగాను 500 మార్కులు కేటాయించి ప్రతీ యూనివర్సిటీకి ర్యాంకింగ్స్ కేటాయిస్తారు. యూనివర్సిటీలోని విద్యాబోధన, వనరులకు వంద, పరిశోధన, ప్రొఫెసనల్ ప్రాక్టీస్-100, డిగ్రీ సాధించిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా -100, చేరికలు, ఉత్తీర్ణుల సంఖ్యకు -100, యూనివర్సిటీలోని విజ్ఞానం- 100 వెయిటేజీ కేటాయించారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ సమగ్ర ర్యాంకింగ్స్-2020లో ఉస్మానియా యూనివర్సిటీకి 53, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు 15వ స్థానం దక్కగా.. ఎన్ఐటీ(వరంగల్)కు 46వ స్థానంలోను, ఐఐటీహెచ్ 17వ స్థానంలో నిలిచాయి. గతేడాది వరుసగా ఓయూ-43, యూఓహెచ్-11, ఎన్‌ఐటీ-61, ఐఐటీ-22 వ స్థానాల్లో నిలిచాయి. మన రాష్ట్రంలో రెండు యూనివర్సిటీలు తమ ర్యాంకింగ్స్ కోల్పోగా.. మరో రెండు మెరుగు పడ్డాయి. ప్రధానంగా తెలంగాణలో ప్రథమ స్థానంలో గుర్తించే ఓయూ తన ప్రభావం కోల్పోవడం రాష్ట్రంలో విద్యావ్యవస్థకు అద్ధం పడుతోందని ఓయూ విద్యార్థి నాయకులు అభిప్రాయపడ్డాయారు.
యూనివర్సిటీ విభాగంలో..
తెలంగాణలోని ప్రథమ శ్రేణిలో ఉండే ఓయూ, హెచ్‌సీయూ సమగ్ర ర్యాకింగ్స్‌లో తమ స్థానాలను కోల్పోయాయి. అయితే యూనివర్సిటీలో విభాగంలో ఐఐఐటీ – హైదరాబాద్ 78వ స్థానంలో నిలిచింది. ఐఐటీతో పాటు ఓయూ, హెచ్‌సీయూలకు మాత్రమే టాప్ -100 యూనివర్సిటీల్లో ర్యాకింగ్స్ దక్కాయి. తెలంగాణలో మరో యూనివర్సిటీ ఇఫ్లూ 115వ స్థానంలో నిలిచింది. ఫార్మాసీ విభాగంలో 73.81 స్కోర్‌తో ఎన్ఐపీఆర్ ఐదో స్థానం దక్కించింది. న్యాయశాస్త్రంలో 73.12 స్కోర్‌తో నల్సార్ యూనివర్సిటీ మూడో స్థానంలో నిలిచింది. 2019లో నిర్వహించిన ర్యాంకింగ్స్‌లో యూనివర్సిటీల విభాగంలో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి 79 వ ర్యాంక్ దక్కగా.. ఈ ఏడాది టాప్ -100లో స్థానం దక్కలేదు.
ఎన్‌ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఫలితాలు:
(స్థానాలు/ సంవత్సరం)
యూనివర్సిటీ | 2020 | 2019 | 2018 | 2017 |
ఓయూ | 53 | 43 | 45 | 38 |
ఐఐటీ-హెచ్ | 17 | 22 | 22 | 26 |
హెచ్‌సీయూ్ | 15 | 11 | 11 | 14 |
ఎన్‌ఐటీ(వరంగల్) | 46 | 61 | 78 | 82 |