- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వచ్చే నెలలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు ప్రారంభం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో పర్యటించారు. కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్‌సింగ్‌ను కలిసి భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను ప్రారంభించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బుగ్గన విశాఖ నావెల్ ఎయిర్‌పోర్టు విధి విధానాలపై చర్చించామని, వచ్చేనెలలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు ప్రారంభిస్తామని తెలిపారు. ఇందుకు కేంద్రం నుంచి లైసెన్స్ ఫీజులు తదితర అంశాలకు సంబంధించి మినహాయింపులు కోరినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త నేషనల్ హైవేలపై త్వరలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తామని వెల్లడించారు.
Next Story