మళ్లీ.. లక్ష్మీదేవిపల్లి లొల్లి

by Shyam |   ( Updated:2020-06-02 22:32:06.0  )
మళ్లీ.. లక్ష్మీదేవిపల్లి లొల్లి
X

దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల రైతులు పాలమూరు‌‌–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్నో ఏండ్లుగా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలు నెరవేరతాయా లేదా అనే అనుమానులు వారిలో నెలకొన్నాయి. కాళేశ్వరం తర్వాత కృష్ణా జలాల పరివాహాక ప్రాంత ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుందని భావించారు. కానీ ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా కృష్ణా జలాలు తరలించుక పోతుంటే తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇదే అదునుగా భావించిన కాంగ్రెస్​, బీజేపీ నేతలు పెండింగ్​ ప్రాజెక్టులను తక్షణమే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా తమ ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం కృష్ణా జలాల తరలింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయా పార్టీలు ముందుకు కదులుతున్నాయి. అందులో భాగంగానే లక్ష్మిదేవిపల్లి ప్రాజెక్టు నినాదంతో కాంగ్రెస్, బీజేపీ పోరుబాటకు సిద్ధమైంది. ఆ పోరును తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని కాంగ్రెస్​ పార్టీ వేదిక చేసుకుంది. ఉద్యమ సమయంలో ‘పెండింగ్​ ప్రాజెక్టులను కూర్చి వేసుకొని పూర్తి చేస్తా’ అని కేసీఆర్​ మాటలకు సంబంధించి బీజేపీ నాయకులు ఆయుధాలుగా వాడుకుంటున్నారు. వారం రోజుల క్రితం బీజేపీ నాయకులు లక్ష్మిదేవిపల్లి ప్రాజెక్టు వద్ద కూర్చి వేసి సీఎం కేసీఆర్​ కూర్చి వేశాము వచ్చి ప్రాజెక్ట్​ చేపట్టాలని డిమాండ్​ చేశారు.

సామర్థ్యం తగ్గింపునకు కుట్ర..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే మొట్టమొదట పాలమూరు-రంగారెడ్డి జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారు. లక్ష్మీదేవి‌పల్లి వద్ద కుర్చీ వేసుకొని పనులు చేయిస్తానని చెప్పిన కేసీఆర్ ఈ ప్రాంతం పట్ల నిరాసక్తత చూపడంతో ప్రతి పక్షాలు వాటిని ఆయుధాలుగా మార్చుకున్నాయి. షాద్‌నగర్‌ డివిజన్​లోని కొందుర్గ్ మండలంలోని లక్ష్మీదేవిపల్లికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావాలని రంగారెడ్డి జిల్లా ప్రజలు కోరుతున్నారు. జూరాల మీది పథకాన్ని, శ్రీశైలం మీది పథకాన్ని లక్ష్మీదేవిపల్లికి లింక్‌ చేసి నోడల్‌ పాయింట్‌గా గుర్తించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలో సాగుజలాల ప్రాజెక్టులు లేకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతోనైనా తమ ప్రాంతం సస్యశ్యామలం భావించారు. కానీ నేటికా వారికి ఆ ఆశ నెరవేరలేదు. ఓవైపు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కాళేశ్వరం ఎత్తిపోతల నీళ్లు పరుగులు పెడుతుంటే పాలమూరు-రంగారెడ్డి ఆగిపోవడం వెనుక మతలబేంటని ప్రశ్నిస్తున్నారు. ఇంకో వైపునుంచి తెలంగాణ, ఆంధ్ర సీఎంలు గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం పేరిట పులిచింతల, నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను రివర్స్ పంపింగ్‌ పద్ధతిలో గోదావరి నీటితో నింపి రెండు ప్రాంతాల పూర్వ ఆయకట్టుకు అదనపు నీరు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ సామర్థ్యం తగ్గింపునకు కుట్ర జరుగుతోందని… అందులో భాగంగానే లక్ష్మిదేవి‌పల్లి రిజర్వాయర్​ సామర్థ్యం తగ్గింపునకు పాలకులు ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.

ప్రాజెక్టు నిర్మాణమే ప్రతిపక్షాల ఎజెండా

రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలో ప్రతి ఎకరం వర్షం పై, బోరుబావులపై ఆధారపడి సాగుచేస్తారు. కానీ ఒక ఎకర భూమి కూడా రిజర్వాయర్ జలాలతో సాగయ్యే భూమి లేదు. ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. వీరి బలంతోనే ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ సాగు జలాలు అందించే విషయంలో అన్ని పార్టీల నేతలు నిర్లక్ష్యం చేశారు. అందుకు భిన్నంగా ఉద్యమాలు చేయాల్సి ఉందని కాంగ్రెస్, బీజేపీ అంటున్నాయి. అందుకోసం జిల్లా ప్రజలను ఏకం చేసేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని భావిస్తున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్​ నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్​ చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed