సర్కార్ చెప్పేదేంటి.. స్వలింగ సంపర్కం & వివాహంపై సినిమాలు తీస్తా!

by Jakkula Samataha |
సర్కార్ చెప్పేదేంటి.. స్వలింగ సంపర్కం & వివాహంపై సినిమాలు తీస్తా!
X

దిశ, సినిమా : స్వలింగ వివాహంపై ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను ఫిల్మ్ మేకర్ ఒనిర్ వ్యతిరేకించారు. కాగా భారతీయ వివాహ సంప్రదాయం.. ఇద్దరు వ్యక్తుల యూనియన్ కాదు, ఒక ఇన్‌స్టిట్యూషన్ వంటిదని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఒకే లింగానికి చెందిన వ్యక్తులు భాగస్వాములుగా కలిసి జీవించడం, లైంగిక సంబంధం కలిగి ఉండటం అనేది భారతీయ కుటుంబంతో పోల్చలేమని స్పష్టం చేసింది.

దీనిపై స్పందించిన ఫిల్మ్ మేకర్ ఒనిర్.. ఎల్‌జీబీటీక్యూఐ హక్కుల కోసం తానెప్పుడూ పోరాడుతూనే ఉంటానన్నారు. సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరం కాదన్న సుప్రీం కోర్టు తీర్పు తర్వాత, ఇప్పుడు మరో బ్యాక్ స్టెప్ తీసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మెజారిటీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటారనే దానిపై చట్టం రూపొందించడం కాదు.. ఏది తప్పు ఏది ఒప్పు అనే దానిపై రూపొందించాలన్నారు. మానవ హక్కుల కంటే మరేదీ ముఖ్యమైనది కాదని, మనుషులందరికీ సమాన హక్కు, గౌరవం ఉండాలని అభిప్రాయపడ్డారు. మంచిని నిర్ణయించగలిగే అధికారం ఇచ్చినప్పుడు.. ఆలోచన లేకుండా ఇచ్చే తీర్పులు చూస్తే ఆశ్చర్యమేస్తుందని, అయినా మన హక్కుల గురించి నిర్ణయించే అధికారం మరొకరికి ఎలా ఉంటుంది? ఇది చాలా అన్యాయం కదా! అని ప్రశ్నించారు. ఒక మానవ కార్యకర్తగా, మానవ హక్కుల ఉల్లంఘన చర్యను ఖండిస్తున్నానన్న ఒనిర్.. తన సినిమాల్లో స్వలింగ వివాహం గురించి కచ్చితంగా హైలెట్ చేస్తానని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed