ఓఎన్‌జీసీ నష్టం రూ.3,098 కోట్లు!

by Harish |
ఓఎన్‌జీసీ నష్టం రూ.3,098 కోట్లు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరానికి మార్చితో ముగిసిన త్రైమాసికంలో ప్రభుత్వరంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ) రూ.3,098.26 కోట్ల నికర నష్టాలను చవిచూసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.4,239.50 కోట్ల నికర లాభాలను ఆర్జించడం గమనార్హం. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 19.81 శాతం క్షీణించి రూ. 21,456.20 కోట్లకు చేరుకుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ. 26,764.60 కోట్ల నుంచి రూ. 13,444.54 కోట్లకు పడిపోయింది. మొత్తం ముడి చమురు ఉత్పత్తి జనవరి-మార్చి మధ్య 1.40 శతం తగ్గి 5.82 మిలియన్ టన్నులకు తగ్గిందని, గతేడాది ఇది 5.90 మిలియన్ టన్నులుగా నమోదైనట్టు కంపెనీ వివరించింది. కొవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా డిమాండ్ క్షీణించడంతో గ్యాస్ ఉత్పత్తి జనవరి-మార్చిలో 7.90 శాతం తగ్గి 6.04 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed