చిత్తూరులో గజరాజుల బీభత్సం.. ఒకరు మృతి

by srinivas |
చిత్తూరులో గజరాజుల బీభత్సం.. ఒకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటన గుడుపల్లి మండలం చింతరపాల్యంలో ఆదివారం చోటుచేసుకుంది. ఉదయం చెరువుగట్టుకు వెళ్లిన నారాయణస్వామి అనే వ్యక్తిపై ఏనుగులు తీవ్రంగా దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరించారు. అంతేగాకుండా శాంతిపురం మండలం రాళ్లపల్లిలో మహిళా రైతు పాపమ్మపై మరో ఏనుగు దాడి చేసింది. పొలం పనులు చేస్తుండగా, ఏనుగులు ఒక్కసారిగా దాడి చేయడంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. కాగా గతవారం రోజులుగా కుప్పం ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed