- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు
దిశ నల్లగొండబైకును కారు ఢీకొట్టడంతో భర్త మృతిచెందగా, భార్యకు తీవ్ర గాయాలైన సంఘటన బీబీనగర్‌లో జరిగింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బోడుప్పల్‌కు చెందిన జాల మల్లారెడ్డి భార్యతో కలిసి భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని తన కూతురు ఇంటికి వచ్చారు. శుక్రవారం ఉదయం తిరిగి బైక్‌పై బోడుప్పల్‌కు బయల్దేరారు. బీబీనగర్ చెరువుకట్ట సమీపంలో వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో భార్యభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను 108లో భువనగిరి హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మల్లారెడ్డి మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం భారతమ్మను హైదరాబాద్‌కు తరలించారు.
Tags: road accident, One dead , emergency, nalgonda
Next Story