- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమె.. ఒకేరోజు అమ్మగా.. సర్పంచ్‌గా..!
దిశ, వెబ్‌డెస్క్ : ఓ ఇల్లాలికి అరుదైన అనుభవం ఎదురైంది. తల్లిగా మాతృత్వం పంచి.. ఊరికి ప్రథమ పౌరురాలిగా ఎన్నికైంది.ఈ రెండు ఘటనలు ఒకే రోజు జరగడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. అదృష్టం అంటే ఆమెదే అనికొందరు.. బిడ్డ తెచ్చిన విజయమని మరికొందరు ఆ మహిళను సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు. ఇంతకూ విషయం ఏంటంటే..?
కృష్ణా జిల్లా, కలిదిండి మండలం, కోరుకల్లు గ్రామ పంచాయతీ స్థానం మహిళకు రిజర్వు అయింది. సర్పంచ్ బరిలో గ్రామానికి చెందిన బట్టు లీలాకనకదుర్గ బరిలో నిలిచారు. రెండో విడత జరిగిన ఈ ఎన్నికల్లో లీలాకనకదుర్గ నిండు గర్భిణీగా ఉండి విస్తృతంగా ప్రచారం చేశారు. శనివారం జరిగిన పోలీంగ్‌లో పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తొమ్మిది నెలలు నిండిన ఆమెకు ఓటేసిన కొద్ది సేపటికే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో జరిగిన ఓట్ల లెక్కింపులో లీలాకనకదుర్గ ప్రత్యర్థి అభ్యర్థిపై 689 ఓట్లతో ఘన విజయం సాధించింది.
అమ్మగా అటు శిశువుకు జననం.. సర్పంచ్‌గా ఇటు గ్రామానికి ప్రథమ పౌరురాలిగా ఎన్నిక కావడంతో లీలాకనకదుర్గ సంతోషానికి అవధులు లేవు. ఈ విజయం తన బిడ్డ తీసుకొచ్చిందేనని సంబరపడింది. తనకు ఓటు హక్కు వచ్చిన తర్వాత రెండుసార్లు ఎన్నికలు జరిగాయని, రెండవసారి తన ఓటు తనకే వేసుకుంటానని ఊహించలేదని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.