తాడిపత్రిలో మళ్లీ హై టెన్షన్

by Anukaran |   ( Updated:2021-01-03 20:56:16.0  )
తాడిపత్రిలో మళ్లీ హై టెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరో సారి హై టెన్షన్ నెలకొంది. జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్షకు సిద్ధమవడంతో వారి అనుచరులు భారీగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు నియోజకవర్గంలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రి అంతటా 144 సెక్షన్‌ను విధించారు. దీనికి తోడు జేసీ బ్రదర్స్, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇళ్ల ఎదుట కవాతు నిర్వహించారు. సభలు, సమావేశాలు, ధర్నాలకు అనుమతులు ఇవ్వమని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయినప్పటికీ ఆమరణ దీక్షకు దిగుతామని జేసీ బ్రదర్స్ తేల్చి చెప్పడంతో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటీవల జేసీ ఇంటికి పెద్దారెడ్డి వెళ్లడంతో మళ్లీ పాతకక్షలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed