కల్పవృక్ష వాహనంపై మలయప్పస్వామి

by srinivas |
కల్పవృక్ష వాహనంపై మలయప్పస్వామి
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో సాలకట్లల బ్రహ్మోత్సవాలు నాలుగు రోజులుగా ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నాలుగో రోజు స్వామివారికి కల్పవృక్ష వాహనసేవ జరిగింది. ఆలయంలోని కళ్యాణోత్సవం మండపంలో శ్రీ మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై తలపాగ, జాటీతో నయనానందకరంగా కనిపించారు.. మంగళవాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా వైరస్‌ కారణంగా అధికారులు ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేసిన సంగతి విదితమే. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story