బ్రేకింగ్ న్యూస్.. వరంగల్ లో తొలి ఒమిక్రాన్ నమోదు..

by vinod kumar |   ( Updated:2021-12-27 04:34:48.0  )
corona
X

దిశ, కాశీబుగ్గ: స్విట్జర్లాండ్ నుండి వచ్చిన 24 సంవత్సరాల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె. వెంకటరమణ సోమవారం ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆ వ్యక్తి డిసెంబర్ 12న వరంగల్ లోని బ్యాంక్ కాలనీకి చేరుకోగా.. అతనికి సాధారణంగా కరోనా పరీక్షలు నిర్వహించారు.

అయితే ఆ పరీక్షల్లో అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వెంటనే సదరు వ్యక్తిని హైదరాబాదులోని టిమ్స్ హాస్పిటల్ కు వైద్య సేవల కొరకు రెఫర్ చేశామని డాక్టర్లు తెలిపారు. అతని దగ్గరి బంధుమిత్రులకు 20 మందికి టెస్టులు చేశామని, రిపోర్ట్స్ కోసం చూస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రజలంతా జాగ్రత్తగా ఉంటూ కరోనా జాగ్రత్తలు పాటించాలన్నారు కోరారు.

Advertisement

Next Story

Most Viewed