ఆ లెక్క తేలింది

by Shyam |
ఆ లెక్క తేలింది
X

కొవిడ్​ టీకా వేసేందుకు రాష్ట్రంలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్రం మొత్తం మీద 51,48,184 మంది వృద్ధులు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీరికి రెండు విడతలుగా 1,02,96,368 డోసుల టీకాను అందించనున్నారు. అత్యధికంగా హైదరాబాద్​ జిల్లాలో 5,09,807మంది ఉండగా అత్యల్పంగా ములుగు జిల్లాలో 39,420 మంది ఉన్నారు. వీరందరికీ టీకాను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,200 కోవిడ్ టీకా సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో:
కరోనా టీకాను వృద్ధులు, ధీర్ఘకాలిక వ్యాదిగ్రస్తులకు అందించేందుకు ప్రభుత్వం 51,48,184 మంది జాబితాను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 3.5కోట్ల మందిలో తొలిసారిగా వృద్ధులు, ధీర్ఘకాలిక రోగుల జాబితాను ప్రభుత్వం అధికారికంగా సిద్ధం చేసింది. వీరందరందికి రెండు డోసుల్లో కరోనా టీకాను అందించనున్నారు. మొదటి విడుతలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి హెల్త్ వర్కర్స్ కు, పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు విజయవంతంగా కొవిడ్ టీకాను అందించింది. ఈ టీకాను వేయించుకున్న వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం, అస్వస్థతకు గురికావడం నమోదు కాలేదు. దీంతో ఇదే తరహాలో రెండో విడుతలో సామాన్యులకు కొవిడ్ టీకాను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సామాన్యుల్లో మొదటి ప్రాధాన్యంగా 60ఏళ్లు దాటిన వారికి, 45ఏళ్లు దాటిన ధీర్ఘకాలిక రోగులకు టీకాను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 51,48,184 మందిని ప్రభుత్వం గుర్తించింది. వీరిలో అత్యధికంగా హైదరాబాద్ 5,09,807మంది ఉండగా అత్యల్పంగా ములుగు జిల్లాలో 39,420 మంది ఉన్నారు. వీరందరికీ టీకాను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1200 కోవిడ్ టీకా సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మండలాల వారీగా ఏర్పాటు చేసిన కేంద్రాల మాదిరిగానే కోవిడ్ కేంద్రాలను నిర్వహించనున్నారు. ప్రతి సెంటర్ లో రోజుకు 200 మందికి చొప్పున టీకాను అందించేందుకు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. అన్ని సెంటర్లలో కలిపి రోజుకు 2,40,000 మందికి టీకాను అందించేందుకు వైద్యసిబ్బంది సిద్ధమయ్యారు.

టీకాను అందించిన 28వ రోజున రెండవ డోసును కూడా అందించేందుకు మొత్తం రెండు డోసుల్లో కలిపి ప్రభుత్వం 1,02,96,368 డోసుల టీకాను సిద్ధం చేయనుంది. టీకాను పొందేవారు కోవిన్ యాప్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. టీకాను అందించేందుకు ప్రతి సెంటర్ లో వైద్యాధికారితో పాటు మరో ఆరుగురు సిబ్బంది టీకా సెంటర్ లో విధులు నిర్వహించనున్నారు. వీటితో పాటు టీకావేసే సమయంలో అస్వస్థతకు గురైనవారిని దవాఖానాలకు తరలించేందుకు అంబులెన్స్ లను కూడా ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాల వారీగా వృద్ధులు, దీర్ఘకాలిక రోగుల జాబితా

జిల్లా వృద్ధులు, దీర్ఘకాలిక రోగుల సంఖ్య

ఆదిలాబాద్ 1,04,026
భద్రాద్రి కొత్తగూడెం 1,65,004
హైదరాబాద్ 5,09,807
జగిత్యాల 1,37,020
జనగాం 73,629
జయశంకర్ భూపాల పల్లి 60,228
జోగుళాంబ గద్వాల 87,100
కామారెడ్డి 1,37,410
కరీంనగర్ 1,43,000
కుమ్రంభీం ఆసిఫాబాద్ 74,759
మహబూబాబాద్ 1,02,782
మహబూబ్ నగర్ 1,27,290
మంచిర్యాల 1,05,108
మెదక్ 99,766
మేడ్చల్ మల్కాజ్ గిరి 5,08,820
ములుగు 39,420
నాగర్ కర్నూల్ 1,21,550
నల్గొండ 2,26,590
నారాయణపేట 83,021
నిర్మల్ 95,748
నిజామాబాద్ 2,11,190
పెద్దపల్లి 1,04,000
రాజన్నసిరిసిల్ల 72,339
రంగారెడ్డి 4,14,180
సంగారెడ్డి 2,27,890
సిద్దిపేట 1,31,568
సూర్యాపేట 1,44,935
వికారాబాద్ 1,26,434
వనపర్తి 81,500
వరంగల్ రూరల్ 96,460
వరంగల్ అర్బన్ 1,55,220
యాదాద్రి భువనగిరి 1,03,480
మొత్తం 51,48,184

Advertisement

Next Story