17 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

by Sumithra |
17 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
X

దిశ, నల్లగొండ: అక్రమంగా తరలిస్తున్న 17 టన్నుల రేషన్ బియ్నాన్ని అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలులో జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రేషన్ కార్డు లబ్దిదారుల నుంచి 17 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా గమనించిన స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన అధికారులు వెంటనే లారీని పట్టుకుని బియ్యం స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా సదరు వ్యాపారి బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు.

Tags: Officers, seized, 17 tonnes, ration rice, illegally, nalgonda, suryapet



Next Story

Most Viewed