- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంపుతామని బెదిరించారు !
దిశ, క్రైమ్‌బ్యూరో: 139మంది, 5వేల మార్లు రేప్ చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో గత మూడ్రోజులుగా భరోసా కేంద్రంలో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. 139 మంది వివరాలను బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు ద్వారా అందించింది. ఇప్పటికే నిందితులపై రేప్ కేసు, గ్యాంగ్ రేప్, వేధించడం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం సమయంలోనే ఆమె చెప్పిన విషయాలను రికార్డు చేసిన పోలీసులు, సోమవారం మాత్రం రాత్రి 8గంటలు దాటిన తర్వాత స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.
అయితే బాధితురాలిని ఇన్నాళ్లు ఎందుకు ఫిర్యాదు చేయలేదనే విషయాలపై ప్రశ్నించగా.. ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించారని బాధితురాలు చెప్పినట్టు సమాచారం. కేసులో నిందితులుగా ప్రముఖ రాజకీయ, సినీ, వ్యాపారాలకు చెందిన ఉండడం, అందులో ఒకే కేసులో 139మంది నిందితులు కావడంతో పోలీసులకు విచారణ సవాల్ అని చెప్పొచ్చు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కావడంతో భరోసా కేంద్రంలో బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డు అనంతరం ఏసీపీ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభం కానుంది.