- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆఫీస్ బాయ్ టు స్టార్టప్ ఫౌండర్!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి ఎంతోమందికి ఉపాధి లేకుండా చేసి, రోడ్డున పడేసింది. ఇదొక కోణమైతే, కొవిడ్.. కొంతమందికి కొత్త దారులు చూపించింది. సరికొత్త ఉపాధి మార్గాలను దగ్గర చేసింది. ఈ క్రమంలోనే ఆఫీస్ బాయ్‌గా జీవితాన్ని మొదలుపెట్టిన బీడ్‌కు చెందిన ఓ వ్యక్తి.. స్టార్టప్ కంపెనీ స్థాపించే స్థాయికి ఎదిగాడు. ఒకరి దగ్గరి ఉద్యోగం చేసే భగత్.. ఇప్పుడు తనే కొంతమందికి ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతున్నాడు.
మహారాష్ట్రలోని బీడ్.. ఓ పల్లెటూరు. ఆ గ్రామానికి చెందిన దాదాసాహెబ్ భగత్.. తొలుత ఇన్ఫోసిస్‌లో ఆఫీస్ బాయ్‌గా తన జీవితాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలోనే నెల నెల కొంత డబ్బును పొదుపు చేశాడు. అలా దాచుకున్న డబ్బులతో యానిమేషన్, గ్రాఫిక్ డిజైన్ మీద ఇష్టంతో.. ఓ సర్టిఫికేషన్ కోర్స్ నేర్చుకున్నాడు. కోర్సు కంప్లీట్ చేసిన సంవత్సరంలోపే జాబ్ సంపాదించాడు. కొన్ని సంవత్సరాల్లోనే మోషన్ గ్రాఫిక్స్, బ్రాండింగ్ అండ్ అడ్వర్టైజింగ్ విభాగంలో సొంత కంపెనీ స్థాపించాలని డిసైడ్ అయ్యాడు. ఈ సమయంలోనే కొవిడ్ కారణంగా.. తను చేస్తున్న కంపెనీ ఆపరేషన్లు నిలిపివేశారు. దాంతో ఏప్రిల్‌లో తన సొంతూరులోని ఓ పశువుల కొట్టంలో ‘డూగ్రాఫిక్స్’ అనే కంపెనీ స్థాపించాడు భగత్ .
గ్రాఫిక్స్ నేర్చుకునేందుకు చాలా సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఇతర దేశాలు రూపొందించినవే. కాగా, ఆన్‌లైన్ గ్రాఫిక్ డిజైన్ ఈజీగా నేర్చుకునేలా ‘డూ గ్రాఫిక్స్’ అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాడు. అలా ముగ్గురు ఉద్యోగులతో పని మొదలుపెట్టిన భగత్.. ఇప్పుడు ఎనిమిది మందితో సక్సెస్‌ఫుల్‌గా కంపెనీని రన్ చేస్తున్నాడు. ఆరు నెలల్లోనే మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగళూర్ నుంచే కాకుండా.. జపాన్, ఆస్ట్రేలియా, యూకేల నుంచి 10వేల యాక్టివ్ యూజర్లను సంపాదించాడు. ఇటీవలే.. భారత ప్రభుత్వం కూడా భగత్ స్టార్టప్‌ను గుర్తించి రికగ్నిషన్ అందించడం విశేషం.
ఇంటర్ చదివిన రామేశ్వర్ షిండే.. భగత్ సాయంతో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్న ఊరిలోనే 8 వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. మరో ఇంటర్ స్టూడెంట్.. సోషల్ మీడియా పోస్టర్స్, విజిటింగ్ కార్డ్స్ తయారు చేస్తూ ‘డూగ్రాఫిక్స్’లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ అందించే టూల్స్ అన్నీ కూడా ఫ్రీగా అందిస్తున్నాడు. త్వరలోనే మానిటైజేషన్ వచ్చేలా.. రెవెన్యూ మోడల్ తీసుకొస్తామని భగత్ తెలిపాడు.