- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జేఈఈ, నీట్ అభ్యర్థులకు ఉచిత రవాణా
భువనేశ్వర్: జేఈఈ మెయిన్ 2020, నీట్ రాసే అభ్యర్థులకు ఉచిత రవాణా, అకామడేషన్ సదుపాయం కల్పించడానికి ఒడిషా ప్రభుత్వం నిర్ణయించింది. జేఈఈ, నీట్‌లను వాయిదా వేయాలని ప్రధాని మోడీ, విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌లకు సీఎం నవీన్ పట్నాయక్ లేఖలు రాశారు. కానీ, వాయిదా వేస్తున్నట్టు ప్రకటనలు వెలువడలేదు. పరీక్ష తేదీలు సమీపించడంతో అభ్యర్థులు సజావుగా టెస్టులకు హాజరవ్వడానికి చర్యలు తీసుకుంటున్నది.
ఒకవైపు కరోనా తాండవిస్తుండగా, మరోవైపు దాదాపు సగం రాష్ట్రంలో వరదలు వచ్చాయి. తత్ఫలితంగా రవాణా నిలిచిపోయింది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కేవలం ఏడు నగరాల్లో మాత్రమే (26)ఎగ్జామ్ సెంటర్లున్నాయి. ఈ నేపథ్యంలోనే పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి సదుపాయం లేనివారు ప్రభుత్వ రవాణా వ్యవస్థ సేవలను పొందడానికి నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అసిత్ కుమార్ త్రిపాఠి సూచించారు. అవసరార్థులకు స్వల్పకాలం అక్కడ ఉండటానికి వసతి ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.