- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీట్, జేఈఈ వాయిదా వేయండి
న్యూఢిల్లీ: నీట్, జేఈఈ మెయిన్స్‌ను వాయిదా వేయాలి అనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ విషయమై మంగళవారం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్‌కు లేఖ రాశారు. నీట్, జేఈఈ మెయిన్స్‌ను వాయిదా వేయాలని లేఖలో డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశంలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని, ఈ పరిస్థితుల్లో ప్రతిష్టాత్మకమైన పరీక్షలను నిర్వహించడం సురక్షితం కాదని సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. లక్షల సంఖ్యలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎంతో ప్రమాదకరమని లేఖలో పేర్కొన్నారు. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా నీట్, జేఈఈ మెయిన్స్ నిర్వహించడానికి కేంద్ర విద్యాశాఖ సిద్ధమైన విషయం తెలిసిందే. ఒడిశా రాష్ట్రానికి చెందిన 50,000 మంది నీట్, 40,000 మంది జేఈఈ మెయిన్స్‌కు హాజరుకానున్నారు. ఒడిశాలో మొత్తం ఏడు నగరాలు, పట్టణాల్లో రెండు పరీక్షల నిర్వహణ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లను ప్రారంభించింది.