- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నూతన్ నాయుడికి బెయిల్ మంజూరు
by srinivas |

X
దిశ, విశాఖపట్నం: దళిత యుకుడిపై శిరోముండనంతో పాటు, ఐఏఎస్ అధికారుల పేరిట ఫోన్లు చేస్తూ తన సొంత పనులు చేయించుకున్న కేసులో సిని నిర్మాత, బిగ్‌బాస్ ఫేమ్ నూతననాయుడికి ఎట్టకేలకు బుధవారం బెయిల్ మంజూరైంది. నూతన్‌నాయుడుపై ఇప్పటివరకూ నమోదైన కేసులకు గతంలోనే బెయిల్ మంజూరైంది. కానీ పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో నమోదైన అట్రాసిటీ, మోసం కేసుకు సంబంధించి బెయిల్ రావాల్సి ఉండటంతో 70 రోజుల పాటు విశాఖ సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైధీగా ఉన్నాడు.
తన ఇంటిలో పనిచేస్తున్న దళిత యువకుడిని చిత్రహింసలు పెట్టడంతో పాటు, శిరోముండనం ఘటనలో నూతన్‌నాయుడుతో పాటు, తన భార్య సహా ఆరుగుర్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. తాజాగా కుటుంబసభ్యులు కూడా ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. మొత్తం మీద నూతన్‌నాయుడుపై మూడు అట్రాసిటి కేసులు, నాలుగు మోసం కేసులు నమోదు కావడం విశేషం.
Next Story