పోలీసు కస్టడీలోకి నూతన్​ నాయుడు

by srinivas |
పోలీసు కస్టడీలోకి నూతన్​ నాయుడు
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ పేరిట పలువురికి ఫోన్‌ చేసి మోసం చేసిన కేసులో సినీ నిర్మాత నూతన్‌ నాయుడుని విశాఖ పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అతడిని మరింత లోతుగా విచారణ చేసేందుకు అనుమతి ఇవ్వాలని విశాఖ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శని, ఆది, సోమవారాల్లో విచారించడానికి న్యాయమూర్తి పోలీసులకు అనుమతి ఇచ్చారు. దీంతో పోలీసులు ఉదయం విశాఖ సెంట్రల్ జైలు నుంచి పెందుర్తి తీసుకొచ్చి నూతన్ నాయుడిని విచారిస్తున్నారు. దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనం చేసిన కేసులో ఇప్పటికే నూతన్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురు అరెస్టయిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story