- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నర్సును తాకిన అంతుచిక్కిన వ్యాధి..
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పుట్టుకొచ్చిన అంతుచిక్కని వ్యాధి బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఉన్నట్టుండి సడన్‌గా కింద పడిపోవడం, మూర్చ వచ్చినట్లు కొట్టుకుంటుండటంతో జిల్లా వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న రంజిని అనే నర్సు వింత వ్యాధి బారిన పడింది. డ్యూటీలో ఉండగానే అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెకు వైద్యులు వెంటనే ట్రీట్ మెంట్ అందించారు.
అయితే, ఈ వ్యాధి బారిన పడి వారి సంఖ్య ఇప్పటివరకు 450కు చేరింది. పరిస్థితి సీరియస్‌గా ఉన్నవారిలో 8 మందిని విజయవాడకు, ఐదుగురిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్‌కు ఫొన్ చేసి మాట్లాడారు. వింత వ్యాధి సమస్యపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. దీంతో ఆయన కేంద్ర వైద్య బృందం, వైరాలజిస్టులను ఏలూరుకు పంపించేందుకు ఏర్పాటు చేశారు.