- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘వకీల్ సాబ్’ చూశాక ఎన్టీఆర్ రియాక్షన్ మరీ ఇలా ఉంటుందనుకోలేదు!

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్‌బ్యాక్ ఫిల్మ్ ‘వకీల్ సాబ్’ ఆడియన్స్ నుంచి మాసివ్ రెస్పాన్స్ అందుకుంది. ‘పింక్’ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో పవన్ నటనపై విమర్శకులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు సైతం పవన్ పర్‌ఫార్మెన్స్‌ను పొగడకుండా ఉండలేకపోయారు. ఈ క్రమంలో సినిమా చూసిన చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా బెస్ట్ కాంప్లిమెంట్స్ అందించగా.. ఈ మూవీ చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవన్‌ను కలిసి హత్తుకున్నారని, ఇలాంటి సినిమా చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు.
కాగా ‘వకీల్ సాబ్’లో నందాజీగా కనిపించిన ప్రకాశ్ రాజ్‌ను చిరు ప్రశంసించారు. తనను కలిసి మరీ అభినందించారు. తనలాంటి కాలిబర్ నటులు ఉన్నప్పుడు తోటి నటుల పర్‌ఫార్మెన్స్ కూడా బెస్ట్‌గా ఉంటుందన్నారు. ‘వకీల్ సాబ్’లో ప్రకాశ్ రాజ్ నటన కచ్చితంగా అద్భుతంగా ఉందని, పవన్ కళ్యాణ్‌కు గ్రేట్ కౌంటర్ పార్ట్ ఇచ్చాడని అన్నారు.