మీరాకు తారక్ ఫ్యాన్స్ సెగ..

by Shyam |   ( Updated:2020-06-03 02:07:33.0  )
మీరాకు తారక్ ఫ్యాన్స్ సెగ..
X

బంగారం, వాన చిత్రాలతో తెలుగులో గుర్తింపు పొందిన నటి మీరా చోప్రా.. సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. గతంలో తను నటించిన సినిమా యూనిట్స్‌తోనూ గొడవ పెట్టుకున్న వార్తలు అప్పట్లో మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉంటే అనుకోకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఆగ్రహానికి బలైంది మీరా. లేటెస్ట్‌గా ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యల కారణంగా అతడి అభిమానులు మీరాను ఫుల్‌గా ట్రోల్ చేస్తున్నారు. చాలా అసభ్యకర మెస్సేజ్‌లు చేస్తుండటంతో.. ‘దీనికి ఏం సమాధానం చెప్తారు తారక్’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌ను ప్రశ్నిస్తోంది.

రీసెంట్‌గా మీరా చోప్రా ట్విట్టర్‌లో అభిమానులతో చిట్ చాట్‌లో పాల్గొంది. ఈ క్రమంలో టాలీవుడ్‌కు చెందిన కథానాయకుల్లో మీ ఫేవరేట్ ఎవరు? అని ఓ నెటిజన్ అడగ్గా.. సూపర్‌స్టార్ మహేష్ బాబు అని సమాధానం చెప్పింది. తారక్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. ‘తానెవరో తెలియదు.. నేను అతడి ఫ్యాన్ కాదు’ అని చెప్పింది. దీంతో మండిపోయిన తారక్ ఫ్యాన్స్ చాలా అసభ్యకర మెసేజ్‌లతో ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో ప్రతీ మెస్సేజ్‌ను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తోంది. ‘తారక్.. కేవలం మీకు కాకుండా మహేష్ బాబుకు అభిమానిని అని చెప్పినందుకు మీ ఫ్యాన్స్ ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. వేశ్య, పోర్న్ స్టార్ లాంటి పదాలు ఉపయోగిస్తూ అంతకన్నా దారుణంగా నా తల్లిదండ్రులకు కూడా మెస్సేజ్‌లు పెడుతున్నారు. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మీరు సక్సెస్ అయ్యారనే భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. మీరు నా ట్వీట్‌కు స్పందిస్తారనే అనుకుంటాను’ అని తెలిపింది. కాగా సింగర్ చిన్మయి శ్రీపాద సూచన మేరకు మీరా.. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్ పర్సన్ రేఖా శర్మకు, హైదరాబాద్ సిటీ పోలీస్‌కు కూడా ఆ స్క్రీన్ షాట్లను ట్యాగ్ చేసింది.

కాగా తారక్ ఫ్యాన్స్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించిన మీరా.. మరో మహిళను ఇలా ట్రోల్ చేయకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే అవకాశాలు లేకుండా పోయిన మీరా చోప్రా.. కేవలం ఫేమ్ కోసమే ఇదంతా చేస్తోందనే వారూ లేకపోలేదు. చూడాలి మరి.. ఈ వివాదానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో.

Advertisement

Next Story

Most Viewed